జియో సంచలన నిర్ణయం..

ఎయిర్‌టెల్‌,ఐడియా, వొడాఫోన్‌లు త్వరలో ఛార్జీలు పెంచనున్నట్లువెల్లడించిన ఒక రోజు వ్యవధిలో రిలయన్స్‌ జియో సైతం సంచలన నిర్ణయం తీసుకుంది.రాబోయే కొద్ది రోజుల్లో తాము కూడా మొబైల్‌ కాల్స్‌, డేటా ఛార్జీలు పెంచాలని నిర్ణయించింది. టెలికాంఛార్జీల సవరణ కోసం ట్రాయ్ తో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని ఓప్రకటనలో తెలిపింది. ఇతర ఆపరేటర్ల మాదిరిగానే తాము కూడా ప్రభుత్వంతో కలిసిపనిచేస్తామని తెలిపింది. డేటా వినియోగం, డిజిటలీకరణపై ప్రతికూల ప్రభావం పడకుండా రాబోయే కొద్ది వారాల్లో ఛార్జీలు పెంపుప్రక్రియ చేపడతామని స్పష్టం చేసింది.