సగం మీసంతో కల్లిస్..

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న సఫారి క్రికెట్ దిగ్గజం జాక్ కల్లిస్ ఇప్పుడు అంతరించిపోతున్న ఖడ్గ మృగాలను కాపాడే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. సఫారి గడ్డి భూముల్లో ఎక్కువగా ఉండే ఈ జాతిని కాపాడటం కోసం ఒక ఉద్యమాన్నే చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో కల్లిస్ ఒక ఫోటో ని పోస్ట్ చేసాడు… ఒక చాలెంజ్‌లో భాగంగా కచ్చితంగా సగం గడ్డం, సగం మీసంతో కనిపించాడు. దక్షిణాఫ్రికాలో అంతరించిపోతున్న ఖడ్గ మృగాల సంరక్షణలో భాగంగా ‘సేవ్‌ ద రైనో’ చాలెంజ్‌ను స్వీకరించిన కల్లిస్‌ ఈ రకంగా ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో కల్లిస్‌ ఫోటోను పోస్ట్‌ చేయగా అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది.