రంగంలోకి దిగిన సుబ్రహ్మణ్య స్వామి…

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు పరిస్థితి ఏంటి…? ఇప్పుడు రాజకీయ పరిశీలకులు ఇది అంతు చిక్కని ప్రశ్నలా మారింది. అధికారం పంపకం విషయంలో శివసేన బిజెపి ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతుంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తాము తప్పుకున్నట్టు ఇప్పటికే ఎన్సీపీ ప్రకటించింది. బుధవారం ఆ పార్టీ అధినేత శరద్ పవార్ ఈ విషయాన్ని స్పష్టం చేసారు.

ఈ నేపధ్యంలో శివసేనను బుజ్జగించే పనిలో పడింది బిజెపి. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తనవంతుగా శివసేనను దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. “కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శివసేన మార్గం కనుగొనాలి. ఆ పార్టీకి బీజేపీతో కొన్ని సాధకబాధకాలు ఉండటం సహజమే. అయితే హిందుత్వ శక్తులు కనీసం మరో దశాబ్దం పాటైనా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. దానిని దృష్టిలో ఉంచుకుని ఓర్చువహించాలని ఆయన సూచించారు.