వెనక్కు తగ్గుతున్న కాంగ్రెస్..?

శివసేనకు మద్దతు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ముగిసినా ఈ భేటీలో ఎలాంటి స్పష్టతా రాకపోవడంతో సాయంత్రం 4 గంటలకు మరోసారి సమావేశం కానున్నారు. మహారాష్ట్ర సీనియర్ నేతలు ఢిల్లీ రావాలని ఆధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో మిత్ర పక్షం నిర్ణయంపైనే తాము నిలబడతామని శరద్ పవార్ స్పష్టం చేసారు. పార్టీలో భిన్న స్వరాలు వినిపించడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది. దీనితో ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. దీనితో ఎన్సీపీ అధినేత శరద్ పవార్… ఉద్దవ్ థాకరే తో భేటీ అయ్యారు.