ఎన్సీపీకే ఎక్కువ మంత్రిపదవులు?

మహారాష్ట్రరాజకీయాలు ఎన్సీపీకి  కేంద్ర బిందువుగామారుతున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్ర రాజకీయాల్లో శివసేనదే పైచేయిగా ఉండేది. తాజారాజకీయాల నేపథ్యంలో ఎన్సీపీ మాట చెల్లుబాటు అవుతోంది. మంత్రివర్గ విస్తరణజరగాల్సిన తరుణంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. తొలుత శివసేనకుమంత్రిపదవులు ఎక్కువ దక్కుతాయని ప్రచారం జరిగింది. అయితే తాజా పరిమాణాల నేపథ్యంలో ఎన్సీపీకేఎక్కువ మంత్రిపదవులు దక్కనున్నాయి. పవార్ మంత్రాంగం ఫలించడంతో  ఎన్సీపీకి 16 మంత్రి పదవులు ఇచ్చేందుకు శివసేన,కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. శివసేన14 మంత్రిపదవులతో సరిపుచ్చుకోవాల్సి ఉండగా… కాంగ్రెస్ పార్టీకి 13 మంత్రిపదవులుదక్కనున్నాయి.