సంచలన నిర్ణయం తీసుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే…

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపునిచ్చిన కనెక్ట్ ఆంధ్రా నినాదానికి ఆకర్షితుడైన ఆర్కే ఎమ్మెల్యే గా తనకు వచ్చే జీతాలను, ఇతర ఖర్చులను కనెక్ట్ ఆంధ్రాకు ఇస్తున్నట్టు నిర్ణయ తీసుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కి ఆయన లేఖ రాసారు. అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే నిధులకు తాను విరాళం ఇస్తున్నట్టు ఆర్కే పేర్కొన్నారు. నవంబర్ నెల నుంచి ఆయన తనకు వచ్చే జీతాన్ని కనెక్ట్ ఆంధ్రాకు ఇవ్వనట్టు లేఖలో పేర్కొన్నారు. అలాగే ఈ పిలుపుకి విదేశాల నుంచి కూడా స్పందించాలని ఆయన కోరారు.