స్మార్ట్ ఫోన్ పేలి యువకుడు మృతి

స్మార్ట్ ఫోన్ పేలి భవన నిర్మాణ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం ఒడిశాలోని పారాడిప్‌లో ఆదివారం రాత్రి కునా ప్రధాన్‌ (22) తన ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టి, మరో ముగ్గురు కార్మికులతో పాటు గదిలో నిద్రిస్తుండగా ఫోన్ పేలిపోయింది. దీనితో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. నాయగర్ జిల్లాలోని రాణ్‌పూరి ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ఒక ఆలయ నిర్మాణం పనుల నిమిత్తం అతను పని చేస్తున్నాడు.