అయ్యప్పస్వామి సన్నిధిలో సెల్‌ఫోన్ల నిషేధం

అయ్యప్పస్వామిఆలయ గర్భగుడి పరిసర ప్రాంతంలో సెల్‌ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ట్రావెన్‌కోర్‌దేవస్వోమ్‌ బోర్డు ఉన్నతాధికారులు ప్రకటించారు. అత్యంత భద్రతతో కూడిన అయ్యప్పస్వామి గర్భాలయం, స్వామికి సంబంధించిన ఫోటోలను కొందరుభక్తులు ఈ మధ్య  కాలంలో సోషల్ మీడియాలోపెట్టడంతో అధికారులు ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. మాలధారులు అత్యంత పవిత్రంగాభావించే 18 బంగారు మెట్ల వద్ద, గర్భాలయం ముందు, చుట్టు పక్కల ప్రదేశాల్లో సెల్‌ఫోన్లవాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు బోర్డుసభ్యులు కూడా స్పష్టం చేశారు.