నిర్మల… నిర్బల… కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసారు. సోమవారం అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ తనకు ఆమె పట్ల గౌరవం ఉందని, అయితే కొన్నిసార్లు తనకు ఆమెను ఏమని పిలవాలో తెలియడం లేదని, మీరంటే నాకు గౌరవం ఉంది కానీ, నిర్మల సీతారామన్‌ అనడానికి బదులుగా నిర్బల సీతారామన్ అనడం సరైనదవుతుందా? కాదా? అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మీరు మంత్రి పదవిలో ఉన్నారు, అయితే మీరు మీ మనసు విప్పి మాట్లాడుతున్నారా? లేదా? అని నాకు సందేహం కలుగుతోంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ఆయన… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాని చొరబాటు దారులు అన్న సంగతి తెలిసిందే.