గవర్నర్‌గా క్రికెటర్..!

శ్రీలంక మాజీ దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ కి కీలక పదవి దక్కింది. ఆ దేశ నూతన అధ్య‌‌క్షుడు గొటబాయ రాజపక్స శ్రీలంక ఉత్తర ప్రావిన్స్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాలంటూ మురళీధరన్‌ను ఆహ్వానించినట్టు సమాచారం. మురళీధరన్‌తో పాటు మరో ఇద్దరు గవర్నర్ బాధ్యతలు అందుకోనున్నారని సమాచారం. ఈస్ట్ ప్రావిన్స్ వార్నర్‌గా అనురాధ యహంపతి, నార్త్ సెంట్రల్ ప్రావిన్స్ గవర్నర్‌గా తిస్సా వితర్ణ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తుంది. కాగా ఇటీవల రాజపక్స ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.