అనుష్క ‘నిశబ్దం’ టీజర్…

బాగమతి తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క నిశబ్దం చిత్రాన్ని ప్రారంభించింది. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిశబ్దం ట్రైలర్ వచ్చేసింది. గురువారం అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు చిత్ర యూనిట్ నిశబ్దం టీజర్ ను రిలీజ్ చేసారు. ఆసక్తికరంగా ఈ టీజర్ ను రూపొందించారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచే విధంగా వుంది. అయితే ఇందులో అనుష్క దివ్యాంగురాలుగా కనిపిస్తుంది. సస్పెన్సు ఎలిమెంట్స్ తో దర్శకుడు చిత్రీకరించినట్లు తెలుస్తుంది. హేమంత్ మధుకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది.