కర్ణాటక మాదిరి జరగనివ్వం…

మహారాష్ట్రలో కర్ణాటక మాదిరి జరగనిచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. తమ ఎమ్మెల్యేలకు బిజెపి ఆఫర్ ఇస్తుందని ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే తమ ఎమ్మెల్యేలు వెళ్ళే అవకాశమే లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత నితిన్ రౌత్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. గురువార౦ బిజెపి తమ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 25 కోట్లు ఆఫర్ చేసిందని, కర్ణాటక మాదిరిగా ఇక్కడ జరగనివ్వమని,

అలాంటి వాటికి తమ ఎమ్మెల్యేలు లో౦గరని ఆయన స్పష్టం చేసారు. ఇక మరో సీనియర్ నేత హుస్సేన్ దల్వాయ్ మాట్లాడుతూ “కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసే ఉన్నారు. పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా బయటికి వెళ్లడు. పార్టీ అధిష్టానం ఏం చెబితే ఎమ్మెల్యేలు అలా చేస్తారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు కానివ్వబోం. ఎన్సీపీ మా మిత్రపక్షం. వాళ్లు మాతోనే ఉన్నారు. మహారాష్ట్రను కాపాడేందుకే ప్రజలు మాకు ఓటేశారన్నారు. నెల 9తో మహారాష్ట్రలో ప్రస్తుత అసెంబ్లీ గడువు తీరనున్న సంగతి తెలిసిందే.