సినీ పరిశ్రమలో తెలుగుభాష దిగజారిపోయింది: పవన్‌ కల్యాణ్‌

తెలుగు సినీనటులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లోని చాలా మందినటులకు తెలుగు రాయడం రాదని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమలో తెలుగుభాషదిగజారిపోయిందని.. చాలామంది రచయితకలు శాస్త్రాలు, పాండిత్యం తెలియవని తెలిపారు. ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి బూతులు,తిట్లకు పడిపోయింది. మన భాష, సంస్కృతులను కాపాడుకోలేకపోతే అధోగతి పాలవుతాం” అని పవన్‌వ్యాఖ్యానించారు.  తిరుపతిలో తెలుగు వైభవంపేరుతో భాషా పండితులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. మరో వైపుతమ పిల్లలు ఏ మాధ్యమంలో చదువుకోవాలో తల్లిదండ్రులే నిర్ణయించుకునేలా ప్రభుత్వ పాలనఉండాలని పవన్ తెలిపారు.