సెటైర్లు వేసిన పవన్..!

అత్యాచారాల విషయంలో కుల, మత, ప్రాంతాల గురించి ఆలోచించకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఆడబిడ్డల మానప్రాణాలను సంరక్షించుకోలేకపోతే.. 151 సీట్లు ఇచ్చి ప్రయోజనమేంటని అధికార పార్టీ నేతలను పవన్ ప్రశ్నించారు. తిరుపతి కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. తప్పు చేస్తే దండించడం అనేది చాలా ముఖ్యమని.. తప్పు చేసిన వారికి సింగపూర్‌ తరహా శిక్షలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదైనా తేడా చేస్తే చంపేస్తారన్న భయం మృగాళ్లకు లేకపోతే.. ఆడ పిల్లలకు రక్షణ ఎలా అని ఆయన ప్రశ్నించారు. సుగాలి ప్రీతి విషయంలో ఆధారాలున్నా.. ఎలాంటి న్యాయం చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసారు. కదలని బత్తాయి చెట్టును నరికేస్తే పెద్ద రభస చేస్తారు కానీ, కదిలే ఆడపిల్లకు అన్యాయం జరిగితే.. మాట్లాడే దమ్ము, ధైర్యం లేని మీరేం నాయకులని ఆయన నిలదీశారు.