అన్యమత ప్రచారాలపై జనసేనాని సంచలన వ్యాఖ్యలు

శబరిమల వివాదం, మతమార్పిడి, అన్యమత ప్రచారాలపై జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంప్రదాయాన్ని అందరూ గౌరవించాలని … ఒక్కొక్క ధర్మానికి ఇండియాలో ఒక్కొక్క ఆచారం ఉందన్నారు. శబరిమల వివాదం.. రెచ్చగొట్టడానికి చేసే పనులు అని పేర్కొన్నారు. దిశ ఘటనపై స్పందించిన పవన్.. ధైర్యమే తన ఖడ్గనని…  చట్టాల్లో మార్పురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.  చంపేస్తారన్న భయం ఉంటే మానభంగాలు జరగవన్నారు. ఆడబిడ్డల్ని కాపాడలేకపోతే 151 సీట్లు వచ్చి ఏం లాభం అంటూ ప్రశ్నించారు. మరోవైపు ఎవరైనా మతం మార్చుకుంటే కులం పేరెత్తకూడదని సూచించారు. కానీ జగన్ ఒక పక్క మతాన్ని, మరో పక్క కులాన్ని ప్రస్తావిస్తున్నాడని దుయ్యబట్టాడు. వైసీపీది రంగుల ప్రభుత్వమన్న పవన్… ఏడు కొండలవారికి తప్ప అన్నింటికి రంగులు పులుముతున్నారని ఎద్దేవా చేశారు.