ఫొటోతో ఊడిన పైలట్ ఉద్యోగం

ఎటువంటి అనుమతులు లేకుండా ఓ ప్రయాణికురాలిని కాక్ పిట్ లోకి తీసుకెళ్లడంతో పాటు ఆమెను ఫోటో తీసి ఓ పైలట్ తన ఉద్యోగం కోల్పోయాడు. చైనాలోని గుయిలిన్ నుంచి యాంగ్జోకు బయలుదేరిన జీటీ 1011 సర్వీసులో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ప్రయాణికురాలి ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న ఫొటోలో ప్రయాణికురాలు తన చేతి వేళ్లను ‘వీ’ ఆకారంలో పెట్టి ఫొటోలు దిగిన ఆమె, తనకెంతో సంతోషంగా ఉందని, కెప్టెన్ కు ధన్యవాదాలని చెబుతూ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. వైరల్ కావటంతో ఎయిర్ లైన్స్ యాజమాన్యం దృష్టికి వచ్చింది. ఎయిర్ లైన్స్ నిబంధనలకు విరుద్ధంగా సాధారణ ప్రయాణికులను కాక్ పిట్ లోకి అనుమతించడంతో పాటు ఆమె చిత్రాలు తీయడం నేరమేనని ఈ ఫోటో తీసిన పైలట్ ను విధుల నుంచి బహిష్కరించినట్లు అధికారులు తెలిపారు.