పరుగులు తీసిన కేంద్ర మంత్రి!

పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ పరుగులు తీయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కారులోంచి దిగిన వెంటనే సభలోకి పరుగెత్తారు. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతుండటంతో ఆలస్యమవుతుందనే కారణంతో మంత్రి పరుగు తీయడాన్ని పలువురు అభినందిస్తూ ట్వీట్లు కూడా చేశారు.