చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరణ

రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన దీక్షకు పోలీసుల నుంచి అనుమతి రాలేదు. ఈ నెల 14 న ఆయన ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దీక్ష చేపట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలు మినహా ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేసారు. ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీసులను, మున్సిపల్‌ కమిషనర్‌ను టీడీపీ నేతలు కోరగా… ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదంటూ అధికారులు అనుమతి నిరాకరించారు. అయినా సరే చంద్రబాబు దీక్ష చేసి తీరతారని తెలుగుదేశం నేతలు స్పష్టం చేసారు. ఇందుకోసం ధర్నా చౌక్ ని తెలుగుదేశం ఎంపిక చేసినట్టు సమాచారం.