అమెరికాలో ఎంపీ రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…

మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను అమెరికాలో నిర్వహిస్తున్నారు. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను అమెరికా వెళ్ళిన రేవంత్ కి అక్కడి అభిమానులు ఘన స్వాగతం పలికారు. 8, 9 తారీఖులలో అమెరికాలో జరగనున్న తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం 20 వ వార్షికోత్సవ వేడుకలకు రేవంత్ కి ఆహ్వానం అందింది. ఈ నేపధ్యంలో ఆయన అమెరికా బయల్దేరి వెళ్ళారు. ఆయన అక్కడే మూడు రోజుల పాటు ఉంటారని, ఒక చిన్న కార్యక్రమానికి కూడా ఆయన హాజరవుతారని సన్నిహితులు పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియాలో ఆయనకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.