14 ఏళ్ల గిరిజన బాలికపై ఆర్ఎంపీ డాక్టర్ అత్యాచారం డాక్టర్

వరంగల్‌లో ఇటీవల యువతిపై అత్యాచారం, హత్య ఘటన మరువకముందే ఓ గిరిజన బాలికపై కామాంధుడు అత్యాచారం చేశాడు. హన్మకొండలోని ఓ వసతి గృహంలో చదువుకుంటున్న 14 ఏళ్ల బాలికపై ఓ ఆర్‌.ఎం.పి. డాక్టర్ ఈ దురాగతానికి పాల్పడ్డాడు. కంటిపై కురుపు అయ్యిందని చికిత్స నిమిత్తం స్థానిక ఆర్‌.ఎం.పి. వైద్యుడి వద్దకు వెళ్లిన బాలికకు.. చికిత్స చేస్తానని చెప్పి, మత్తు మందు ఇచ్చి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం హాస్టల్‌కు వచ్చి జరిగిన విషయన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపింది. బాలిక తల్లి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.