‘రూలర్’ నుంచి లిరికల్ సాంగ్ విడుదల…

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘రూలర్’ చిత్రం నుంచి లిరికల్ సాంగ్ విడుదలైంది. పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి రచించిన ‘అడుగడుగో యాక్షన్ హీరో.. అరే దేఖో యారో..’ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందించిన ‘రూలర్’.. ఈ నెల 20న విడుదల కానుంది.