సీఎం రాజీనామా చేయాలి…

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనపడటం లేదు. బిజెపి, శివసేన పార్టీలు ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనుకోవడం ప్రజల్ని అగౌరపరచడమేనని అభిప్రాయపడ్డారు. సీఎం పదవి శివసేనకు ఇచ్చేందుకు సమ్మతమయితేనే తమ పార్టీని సంప్రదించాలని అపద్ధర్మ ప్రభుత్వం పేరుతో భాజపా అధికార దుర్వినియోగం చెయ్యొద్దని హితవు పలికిన ఆయన పదవీకాలం ముగియనుండటంతో ఫడణవీస్‌ ముఖ్యమంత్రి పదవికి నేడు రాజీనామా చేయాలని సంజయ్ డిమాండ్‌ చేశారు. అతిపెద్ద పార్టీగా నిలిచిన భాజపాపైనే ప్రభుత్వ ఏర్పాటు బాధ్యత ఉందని ఆయన సూచించారు. ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసి కావాలంటే బలనిరూపణకు నెలరోజుల సమయం తీసుకోవాలని సూచించారు.