సాంగ్‌తో ‘మైండ్ బ్లాక్’ చేసిన దేవీ శ్రీ..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కి ‘సరిలేరు నీకెవ్వరు’ సందడి మొదలైంది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర యూనిట్ కొత్తరకం ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ మొదటి సోమవారం నుంచి ఐదు సోమవారాల్లో ఐదు పాటలు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. అనుకున్నట్టుగానే ఇవాళ తొలి పాటగా ‘మైండ్ బ్లాక్’ అంటూ సాగే మంచి మాస్ సాంగ్‌ను విడుదల చేసారు. ఈ పాట లిరికల్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.