రూ.2000 నోటును రద్దు చేయండి…

పెద్ద నోట్ల స్థానంలో తీసుకొచ్చిన రూ.2000 నోటును కూడా ఇప్పుడు రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆర్ధిక నిపుణుడు ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్‌.సి.గార్గ్‌ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో నగదు చెలామణి ఇంకా భారీగానే ఉందని, రూ.2000నోట్లను కూడా దాచి ఉంచుతున్నట్లు ఆధారాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. కానీ, భారత్‌లో మాత్రం అది చాలా నెమ్మదిగా సాగుతోందన్నారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల విలువలో మూడో వంతు రూ.2000 నోట్లే ఉన్నాయన్న ఆయన వీటిలో చాలా వరకు చెలామణిలోకి రావడం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న రూ.2000నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటే సరిపోతుందని ఆయన సూచించారు. దీని వలన పెద్దగా ఇబ్బందులు రావని ఆయన పేర్కొన్నారు.