ఎస్సై అక్రమ సంబంధం గుట్టు రట్టు…

హైదరాబాద్ లో ఓ ఎస్సై అక్రమ సంబంధం గుట్టును భార్య తన బంధువులతో కలిసి బయటపెట్టింది. మహేశ్వరంలో ఎస్సైగా పనిచేస్తున్న నర్సింహా ఓ కేసులో సస్పెండ్ అయ్యారు. ఆయన నాచారం పరిధిలోని మల్లాపూర్ లో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న నర్సింహా భార్య.. తన బంధువులతో కలిసి మల్లాపూర్ లోని మహిళ ఇంటికి వెళ్లింది. భార్య రాకను ముందుగానే పసిగట్టిన నర్సింహా అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో మహిళ ఇంటి ముందు నర్సింహా భార్య ఆందోళన చేపట్టింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.