ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు అస్వస్థత

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఆమె ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు.విషయం తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కాండీ ఆస్పత్రికి వెళ్లి లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా లతా మంగేష్కర్‌కు ప్రస్తుతం 90 సంవత్సరాలు. దాదాపు 25 వేలకు పైగా సోలో సాంగ్స్ పాడి గిన్నీస్ రికార్డుల్లోకెక్కారు. ఆమె 2001 లో భారత అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ ను అందుకున్నారు.