2024 వరకు గంగూలీయేనా..?

బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆ పదవిలో 2024 వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. గంగూలీ ఆధ్వర్యంలో బీసీసీఐ తొలిసర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో ప్రధానంగా లోధా కమిటీ సిఫార్సులపై చర్చజరిగింది. రెండు పదవుల మధ్య విరామం, క్రికెట్ సలహాదారుల కమిటీ , ఐసీసీలో బోర్డు ప్రతినిధి నియామకం తదితర కీలక అంశాలపై చర్చ జరిగింది.లోధా సంస్కరణల మార్పుకు సభ్యులు ఆమోదం తెలిపారు. మరో వైపు బోర్డు సమావేశనిర్ణయాలను సుప్రీంకోర్టు ఆమోదం తెలపాల్సి ఉంది.