ప్రాణ స్నేహితుడిని అమ్మాయి కోసం చంపేశాడు…

అమ్మాయి విషయంలో జరిగిన గొడవ ఇద్దరి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని కాంచీపురంలో వండలూరులోని వెంకటమంగళం ప్రాంతానికి చెందిన ముఖేశ్, విజయ్ స్నేహితులు. ముఖేశ్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతుండగా, విజయ్ ఫుడ్ డెలివరీబాయ్ గా పని చేస్తున్నాడు. అయితే వీరు ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఈ విషయం తెలిసిన విజయ్… ముఖేష్ కి పలు మార్లు వార్నింగ్ లు కూడా ఇచ్చాడు. అయినా సరే అతనిలో మార్పు రాలేదు. దీనితో ముఖేష్ ఇంటికి తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళిన విజయ్… కొద్దిసేపు ముఖేష్ తో గొడవపడ్డాడు. ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకున్నారు. అనూహ్యంగా గన్ తీసి నుదుటిపై కాల్చాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోగా ముఖేష్ ని పక్కన ఉన్న వారు ఆస్పత్రికి తీసుకు వెళ్ళగా అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.