షోలాపూర్‌ మేయర్‌గా తెలుగు మహిళ

మహారాష్ట్రలోని షోలాపూర్‌ మున్సిపాలిటీ మేయర్‌గా తెలంగాణకు చెందిన తెలుగు మహిళ యెన్నం కాంచన ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో మేయర్‌ పదవి చేపట్టిన తొలి తెలుగు మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. జిల్లా పరిషత్‌ సీఈవో ప్రకాశ్‌ వాయ్‌చల్‌ పర్యవేక్షణలో ఎస్‌ఎంసీ కౌన్సిల్‌ హాల్‌లో బుధవారం జరిగిన ఎన్నికలో బీజేపీ కార్పొరేటర్‌ అయిన కాంచన విజయం సాధించి మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్నారు. కాంచన స్వగ్రామం ఉమ్మడి మెదక్ జిల్లాలోని సదాశివపేట. చాలా సంవత్సరాల కిందటే వారి కుటుంబం షోలాపూర్‌కు వెళ్లింది. మహారాష్ట్రలో మేయర్‌గా ఎన్నికైన తొలి తెలంగాణ మహిళ కాంచన కావడం గమనార్హం. కాగా, డిప్యూటీ మేయర్‌గా బీజేపీ కార్పొరేటర్‌ రాజేశ్‌ కాళే విజయం సాధించారు.