పర్యాటకులకు చుక్కలు చూపించిన పులి

రాజస్థాన్ లో ఒక పులి పర్యాటకులకు చుక్కలు చూపించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్కులో టూరిస్టులు ఓపెన్ టాప్ జీపులో పర్యటిస్తున్నారు. ఈ తరుణంలో… ఒక పర్యాటకుడు ఆ పులిని ఫోటో తీసేందుకు ప్రయత్నించారు. దాన్ని గమనించిన పులి వాహనం వైపు దూసుకొచ్చింది.

దీనితో వారు అక్కడి నుంచి వాహనాన్ని వేగంగా నడిపి బయటపడ్డారు. అయితే అది వారితో ఆడుకోవడానికి చూసింది గాని హాని చేయడానికి చూడలేదని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు.