సమ్మె పై హై కోర్ట్ కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మె ఎస్మా పరిధిలోకి వస్తుందని చెప్పలేమని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. క్రిష్నయ్య అనే ఒక పిటీషనర్ తరుపు న్యాయవాది హైకోర్టు లో దాఖలు చేసిన పిటీషన్ లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్టీసీ పబ్లిక్ యుటిలిటీ సర్వీస్ గా ప్రకటించారు కాబట్టి ఎస్మా ప్రయోగించాలని, సమ్మె ఎస్మా పరిధిలోకి వస్తుందని, సమ్మె చట్టవిరుద్ధమని ఆయన వ్యాఖ్యానించగా స్పందించిన కోర్ట్…

సమ్మె చట్ట విరుద్ధమని చెప్పలేమని స్పష్టం చేసింది కోర్ట్. ఆత్యవసర సేవలు నిలిచిపోయినప్పుడు మాత్రమే ఎస్మా ప్రయోగించడానికి వీలుంటుందని చెప్పిన కోర్ట్… ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధంగా చెప్పలేమని చెప్పుకొచ్చింది. కార్మికులతో చర్చలు జరపాలని తాము ప్రభుత్వానికి సూచించామని, ఇలాగే చెయ్యాలని చెప్పే అధికారం తమకు లేదని కోర్ట్ వివరించింది. విచిత్ర సమస్యలకు తాము రిలీఫ్ ఇవ్వలేమని కోర్ట్ చెప్పుకొచ్చింది.