‘శ్రీ యేసయ్య’ పై విచారణకు ఆదేశాలు…

రోజుకో వ్యవహారం తిరుమలలో కొన్ని వ్యవహారాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టీటీడీ క్యాలెండర్ కోసం వెబ్‌సైట్‌లో వెతుకుతున్న వారికి ‘శ్రీ యేసయ్య’ అని ఒక పధం దర్శనం ఇస్తుంది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని టీటీడీ నూతన క్యాలెండర్లను శుక్రవారం విడుదల చేయడంతో క్యాలెండర్ కోసం భక్తులు వెతుకుతుండగా… మత ప్రచారానికి సంబంధించి పదాలు దర్శనం ఇచ్చాయి. ఇప్పుడు దీనిపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిటిడి అధికారులే ఇలాంటి వాటిని ఏ విధంగా చేస్తున్నారని… పలువురు మండిపడుతున్నారు. ఈ వివాదంపై టీటీడీ స్పందించింది. ఘటనపై విజిలెన్సు విచారణకు తక్షణమే ఆదేశించింది.