శ్రీవారి భక్తులకు టీటీడి షాక్…

శ్రీవారి భక్తులకు టీటీడి షాక్ ఇచ్చింది. తిరుమలలో అద్దెగదుల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నందకం అద్దె గదులను 600 నుంచి వేయి రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కౌస్తుభం, పాంచజన్యం లో 500 నుంచి వేయి రూపాయలకు పెంచగా పెంచిన ధరలను నేటి నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. దీనిపై భక్తులు విస్మయం వ్యక్తం చేసారు. ఒక్కసారిగా డబుల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.