వెంకీ మామ టైటిల్ సాంగ్ విడుదల…

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం వెంకీ మామ. తాజాగా వెంకీ మామ సినిమా నుండి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటకు సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన వస్తోంది. రియల్ లైఫ్ మామా అల్లుళ్లయిన వెంకీ, చైతూలు ఈ ఫన్ ఎంటర్టయినర్ లో నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ మరియు రాశిఖన్నా హీరోహిన్స్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది.