వోడాఫోన్ అదిరిపోయే ఆఫర్

తన వినియోగదారుల కోసం వోడాఫోన్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. నెలకు రూ.999తో రీచార్జ్ చేయిస్తే 50 శాతం వేగవంతమైన డేటాతో పాటుగా రూ.20,000 విలువైన ప్రయోజనాలు అందిస్తూ ప్రకటన విడుదల చేసింది. బండిల్డ్ ఇంటర్నేషనల్ రోమింగ్ సర్వీసు, వొడాఫోన్ రెడ్‌ఎక్స్ ప్లాన్‌లో ఏడాదిపాటు నెట్‌ఫ్లిక్స్ (బేసిక్), అమెజాన్ ప్రైమ్, జీ5, వొడాఫోన్ ప్లే సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతోపాటు రూ.2,999 విలువైన ఏడు రోజుల ఐ-రోమ్ ప్యాక్ ఉచితంగా లభిస్తుంది.

జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మూడు నెలలకు ఒకటి చొప్పున నాలుగుసార్లు ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ కూడా ఉంది. హోటల్స్ డాట్ కామ్ ద్వారా హోటల్ రూములు బుక్‌ చేస్తే నేరుగా 15 శాతం రాయితీ, టికెట్ బుకింగ్స్‌పై 10 శాతం రాయితీ, వొడాఫోన్ రెడ్ఎక్స్ పోస్టుపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్, ఐఎస్‌డీ కాల్స్‌కు నిమిషానికి 50 పైసల రాయితీ, రోజుకు 100 లోకల్, నేషనల్, రోమింగ్ ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత డేటా అందించనుంది.