కార్మికుడే దేవుడయ్యాడు

జీవితం అనేది చాలా విలువైనది… దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని కొన్ని సార్లు క్షణాల్లో ప్రాణాలు కోల్పోతూ ఉంటాం… ఇలాగే ఒక వ్యక్తి క్షణాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చాడు. వివరాల్లోకి వెళితే ఆదివారం అమెరికాలో కాలిఫోర్నియాలోని కొలీజియం స్టేషన్‌లో ఓక్లాండ్ రైడర్స్ ఆట తర్వాత ప్రజలు తిరిగి వస్తు అందరూ రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు.

ఇంతలో ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఫ్లాట్ ఫారం మీద నడుస్తూ వస్తూ కాలు జారి పట్టాల మీద పడిపోగా అక్కడే ఉన్న ఒక రైల్వే కార్మికుడు జనాలను అదుపు చేస్తూ ఉండగా వెంటనే అతను పడిపోవడం గమనించి… చేయి పట్టుకుని పైకి లాగాడు. ఈ ఘటన అక్కడ ఉన్న సెక్యురిటి కెమెరాల్లో రికార్డ్ కాగా దీనిని BART (SFBART) ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కాపాడిన వ్యక్తిని జాన్ గా గుర్తించి అతనిని అభినందించారు అధికారులు.