వర్షంలో తడుస్తూ ముఖ్యమంత్రి ప్రచారం

కర్ణాటకలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉప ఎన్నికల్లో ప్రచారానికి మారో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్న నేపధ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప వర్షంలో తడుస్తూ మరీ ప్రచారం చేసారు. శివాజీనగర్‌ బీజేపీ అభ్యర్థి శరవణ తరపున రోడ్‌షో జరిపారు. సెయింట్‌ బెసిలికా మేరీ చర్చిలో ప్రార్థనల అనంతరం రామస్వామిపాళ్య, మునిరెడ్డిపాళ్యలలో రోడ్‌షో జరిపారు. వర్షం వస్తుండడంతో గొడుగు పట్టుకునే ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఇక మాజీ ప్రధాని దేవెగౌడ సైతం ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన కూడా వర్షంలో ప్రచారం చేస్తూ బిజెపిపై విమర్శలు చేసారు. తాను ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ఆలోచనలో లేనని స్పష్టం చేసారు. కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, సిద్దరామయ్య, పరమేశ్వర్‌లు కె.ఆర్‌.పురం రోడ్‌షోలో ప్రచారం చేసారు.